Ad Code

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం


తెలంగాణలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్  హాస్టల్ గదిలో విద్యార్థి ఎస్ శ్రీనాథ్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా, తోటి విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని అత్యవసర చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన శ్రీనాథ్‌ గత సంవత్సరం ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ నుంచి హకీంపేటకు బదిలీ అయ్యారు . విషయం తెలుసుకున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి హుటాహుటినా ఆసుపత్రికి చేరుకుని డాక్టర్లతో , విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థి చికిత్సకు ఎంతటి ఖర్చు అయిన ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. 

Post a Comment

0 Comments

Close Menu