ప్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల విడుదల చేసిన ‘2023-24 రిలిజియస్ ల్యాండ్‌స్కేప్ స్టడీ’లో అమెరికాలో వివిద మతాల విద్యాస్థాయిలపై ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. ప్రతి 10 మంది హిందువుల్లో ఏడుగురు (సుమారు 70%) డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారు. యూదుల్లో ఈ శాతం 65%గా ఉంది. మొత్తం అమెరికన్ల సగటు గ్రాడ్యుయేషన్ రేటు సుమారు 35% మాత్రమే కావడం గమనార్హం. అంటే జాతీయ సగటుతో పోలిస్తే హిందువులు, యూదులు దాదాపు రెండింతలు ఎక్కువగా ఉన్నత విద్య పొందుతున్నారు. క్రైస్తవ మతంలోని వివిధ విభాగాల్లో విద్యా స్థాయిల్లో పెద్ద తేడాలు కనిపిస్తున్నాయి. ఎవాంజెలికల్ ప్రొటెస్టెంట్లలో సుమారు 29% మంది, నల్లజాతి ప్రొటెస్టెంట్లలో 24% మంది మాత్రమే కాలేజీ డిగ్రీ పూర్తి చేశారు. అయితే, ఎపిస్కోపల్ చర్చ్ సభ్యుల్లో 67% మంది గ్రాడ్యుయేట్లు ఉండగా, అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్‌లలో ఈ సంఖ్య కేవలం 13%గా నమోదైంది. క్యాథలిక్కుల్లో గ్రాడ్యుయేషన్ రేటు 35%తో జాతీయ సగటుకు దగ్గరగానే ఉంది. కానీ జాతి ఆధారంగా స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఆసియా మూలాల క్యాథలిక్కుల్లో 53% మంది డిగ్రీ సాధించగా, హిస్పానిక్ క్యాథలిక్కుల్లో ఈ శాతం సుమారు 20% మాత్రమే.
0 Comments