న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ అని, ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్‌కే కాకుండా దక్షిణాసియాకే గర్వకారణం అవుతుంది. కొత్త సాంకేతికతను భారత్ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. ప్రతిభావంతులకు స్వర్గధామంగా భారత్ ఉంది. ఏఐ కేంద్రంగా ఇండియా మారుతోంది. ఏఐ అనేది ఓ పరివర్తన శక్తి. దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుంది. ఏఐ అనేది యువత భారత్‌కు కొత్త విశ్వాసం, ఆస్తిగా ఉంది. తొలినాళ్లలో ఏఐపై అనేక సందేహాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏఐని యువత ప్రయోజనకరంగా ఉపయోగిస్తోంది. వివిధ రంగాల సమస్యలకు ఏఐ పరిష్కారం చూపుతోంది' అని మోడీ తెలిపారు.
0 Comments