Ad Code

అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో అత్తపై అల్లుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో అత్తకు శరీరంలో కొంత భాగం కాలింది. నిందితుడిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తన కుమార్తె లావణ్యకు జక్కా రవితో వివాహం చేశారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతుంది. భర్త వేధింపులు భరించలేని లావణ్య పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి దాచేపల్లిలోని అత్త ఇంటికి వచ్చిన రవి అత్త, భార్యతో గొడవ పడ్డాడు. రవి తనతోపాటు తెచ్చుకున్న పెట్రోలు అత్తపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. దాడిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి అద్దంకి - నార్కెట్‌పల్లి హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. 

Post a Comment

0 Comments

Close Menu