Ad Code

జీవన్‌రెడ్డి, సంజయ్‌ కుమార్‌ల మధ్య సంధి కుదిర్చిన పార్టీ నాయకత్వం ?


తెలంగాణలోని జగిత్యాల మున్సి పల్ పీఠాన్ని  కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తికే ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌లతో సంధి కుదిర్చిన తర్వాత పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వీరిద్దరితో మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్‌ చర్చలు జరపగా, అవి ఫలించాయనేది ప్రాథమిక సమాచారం. ఇరు వర్గాలకు నేతలు నచ్చచెప్పడంతో వారు మెట్టుదిగి వచ్చారని, ఈ క్రమంలోనే జెండా మోసిన వ్యక్తికు చైర్మన్‌ పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిలో భాగంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇరు వర్గాల నేతలకు నచ్చచెప్పారు. ఈ చైర్మన్‌ పీఠంపై జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌లు చెరో వర్గంగా విడిపోయారు వారు తమ పంతాన్ని నెగ్గించుకోవాలని పట్టుబట్టుకుని కూర్చున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్‌ జెండా మోసిన వ్యక్తికి మేయర్‌ పీఠం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది అధి నాయకత్వం. ప్రత్యేకంగా ఎమ్మెల్యే సంజయ్‌ను ప్రజాభవన్‌కు పిలుపించుకుని మరీ చర్చలు జరిపారు. ఇది ఫలించడంతో జగిత్యాల ఎపిసోడ్‌కు దాదాపు ముగింపు పడినట్లే కనబడుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu