Ad Code

డ్రగ్స్ కేసులో కోలీవుడ్ సినీ నటి అంజు కృష్ణ అరెస్టు


మిళనాడులో యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో కోలీవుడ్ సినీ నటి అంజు కృష్ణ, తమిళ కో-డైరెక్టర్ విన్సీ నివేత సహా మొత్తం 8 మందిని అరెస్ట్ అయ్యారు. చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అంజు కృష్ణ, విన్సీ నివేత, కార్తిక్ రాజు, యశ్వంత్, శ్రీరామ్, అల్విబిన్షా, వెంకటేష్ కుమార్ తదితరులు ఉన్నారు. నిందితుల వద్ద నుండి పోలీసులు 6 గ్రాముల మెతాంఫేటమైన్ (మెత్), 7 గ్రాముల ఓజీ గంజాయి, 15 గ్రాముల సాధారణ గంజాయి, ఎల్‌ఎస్‌డీ స్టాంపులు, స్మోకింగ్ బాంగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, వారికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu