Ad Code

ఐలాపురం వెంకయ్య కన్నుమూత


విజయవాడకు చెందిన ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన యస్సు 93 సంవత్సరాలు. ఆయన మృతికి సీఎం చంద్రబాబు, జగన్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాప ప్రకటనలు చేస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టిన ఐలాపురం వెంకయ్య కష్టపడి ఎదిగారు. విజయవాడలోని ప్రముఖ ఐలాపురం హోటల్ ను స్థాపించి ఇప్పటివరకూ నడుపుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యునిగా ఎన్నికై ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. బీసీల అభ్యున్నతి కోసం తీవ్రంగా పాటుపడ్డారు. అలాగే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషిచేశారు. సాలివాహన సంఘం అధ్యక్షుడిగా కూడా దశాబ్దాల పాటు సేవలందించారు. సామాజిక సేవల్లోనూ ఐలాపురం వెంకయ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యాసంస్థలకు ఫర్నిచర్ విరాళాలు, విద్యార్థుల ప్రోత్సాహానికి సాయాలు, తాగునీటి సరఫరా, ఆలయ నిర్మాణాలు, అన్నదాన సత్రాల వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే అన్ని మతాల పట్ల సమాన గౌరవంతో దేవాలయాలు, చర్చిలు, మసీదులకు విరాళాలు అందించిన చరిత్ర ఆయనది. రేపు ఆయన అంత్యక్రియలు విజయవాడలో నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments

Close Menu