ఎన్‌సీపీ నేత శరద్ పవార్ కు అస్వస్థత : ఆసుపత్రిలో చేరిక


నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజకీయ దిగ్గజం శరద్ పవార్(85) ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప డీహైడ్రేషన్ కారణంగా ఆయన పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన రూబీ హాల్ క్లినిక్‌లో చేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, చికిత్సలో భాగంగా సెలైన్ ఎక్కించామని ఆస్పత్రి వర్గాలు వివరించాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org