తెలంగాణలో మున్సిపల్ ఫలితాలతో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగు పడిందని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పట్టు కోల్పోయిందని, రానున్న రోజుల్లో బీజేపీతో కలవక తప్పని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. "నాడు కమ్యూనిస్టులను తోక పార్టీలన్న బీఆర్ఎస్, ఇప్పుడు వారికే తోక పార్టీగా మారింది. కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే కేటీఆర్ మద్దతు ప్రకటించడం దిగజారుడు రాజకీయం" అని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీపీఐ నేత కూనంనేని చేసిన ఆరోపణలను కేటీఆర్ ఇప్పుడు అంగీకరించినట్లేనా అని ప్రశ్నించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అని కవిత అన్నారు. సింగరేణి ఎన్నికల్లో సైతం జాగృతి, ఏఐఎఫ్బీ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. 40కి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
0 Comments