రైలులో ఓ కుటుంబం శాండ్‌విచ్‌లు తయారు చేసుకున్న వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దివ్య జైన్ అనే ఇన్‌స్ట గ్రామ్ యూజర్ 'రైల్వేలు ఇలాంటి వారిని నిషేధించాలి, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివి ప్రమాదకరం' అంటూ చేసిన పోస్ట్‌లో కుటుంబ సభ్యులు వరుసగా తమ బెర్తుల్లో కూర్చుని ఉన్నారు. వీరంతా ఎంతో సంతోషంగా బ్రెడ్, టమోటా, కీర లాంటి కూరగాయలతో శాండ్‌విచ్‌లు తయారు చేసుకున్నారు. ఒకరు కూరగాయలను కట్ చేయడం, మరొకరు బ్రెడ్‌పై చాకుతోసాస్, చట్నీ పూస్తూ ఎంతో జాయ్‌ఫుల్‌గా బ్రెడ్ శాండ్‌విచ్‌లు తయారు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్ చేశారు. కొంతమంది వీరి వ్యవహారాన్ని ఖండించగా, రైలంటే సొంత కిచెన్ కాదని మరికొంతమంది ఒకింత ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. రైల్వేస్‌లోకి చాకుతో ఎలా అనుమతించారు ఒకరు ప్రశ్నించారు. ఫ్యామిలీతో ట్రైన్ జర్నీలో ఎంచక్కా శాండ్‌విచ్‌లు బావుంది.. ఎందుకంటే రైల్వే స్టేషన్లలో దొరికే ఆహారంగా అంత శుభ్రంగా ఉండదు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ నేపథ్యంలో ఇలాంటి ఫుడ్ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు మంచిదేగా అన్నట్టు వారిని సమర్ధించారు. ఏముందబ్బా, హ్యాపీగా చేసుకుని తింటారు. ఆ తరువాత ఆప్రాంతాన్నిశుభ్రం చేస్తారు..ఇందులో తప్పేముంది అని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఏ రైలులో జరిగింది అనేదానిపై స్పష్టత లేదు.
0 Comments