ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్ యల్లమ్మ (38), ఆమె కొడుకు చిన్నా (22) హత్యకు గురయ్యారు. మొదటి భార్య కొడుకులే యల్లమ్మ, ఆమె కొడుకుని హత్య చేశారనే అనుమానాలు తలెత్తున్నాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శింగనమల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దీనిపై విచారణ చేస్తున్నారు.
0 Comments