Ad Code

ఘనంగా శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం


శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీశైలం పుణ్య క్షేత్రం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందటంతో మహా శివరాత్రికి ఇక్కడ స్వామిని భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. నేటి నుండి ఈనెల 18 వరకు 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,సభ్యుడు,ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రారంభించారు.అర్చకులు వేదపండితులు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతిపూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 15 లక్షల మంది భక్తులు స్వామి అమ్మవారి దర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా జర్మన్ షెడ్లు వేసి ఏర్పాట్లు చేశారు. అలానే భక్తులకు 40 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని అధికారులు చెప్తున్నారు. నిరంతరం నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామి వారిని, అమ్మవారిని దర్శించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు.


Post a Comment

0 Comments

Close Menu