Ad Code

లేడీ డాన్ యశస్విని గౌడ అరెస్ట్


బెంగళూరులో లేడీ డాన్ యశస్వినీ గౌడను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. గతేడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. బాధితుడి నుంచి రాజేష్ అనే వ్యక్తి రూ. 1.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే, ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని వ్యాపారి పదేపదే ఒత్తిడి చేయడంతో, రాజేష్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మబలికి వ్యాపారిని కిడ్నాప్ చేసి, కారులో తిప్పుతూ బెదిరించి మరికొంత నగదును బదిలీ చేయించుకున్నాడు. ఈ కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన సీసీబీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు రాజేష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా, 47 ఏళ్ల యశస్వినీ గౌడ రంగంలోకి దిగింది. పోలీసులను అడ్డుకోవడమే కాకుండా, విధులకు తీవ్ర ఆటంకం కలిగించింది. దీంతో నిందితుడికి సహకరించినందుకు మరియు అధికారులను బెదిరించినందుకు గానూ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యశస్వినీ గౌడపై బెంగళూరు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఏడుకు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. తాజా కిడ్నాప్ కేసుతో ఆమె పాత్ర మరోసారి వెలుగులోకి రావడంతో సీసీబీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu