Ad Code

త్వరలో మార్కెట్లోకి రానున్న మోటరోలా రేజర్ 70 స్మార్ట్‌ఫోన్


మార్కెట్లోకి మోటరోలా రేజర్ 70 స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. యూఏఈకి చెందిన TDRA డేటాబేస్‌లో XT2657-8 అనే మోడల్ నంబర్‌తో దర్శనమిచ్చింది. ఈ సర్టిఫికేషన్ రాకతో ఈ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ గ్లోబల్ లాంచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైనట్లే అని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. స్టైలిష్ లుక్,దిరిపోయే ఫీచర్లతో రానున్న ఈ ఫోన్, మార్కెట్లో ఉన్న ఇతర ఫోల్డబుల్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. టెక్ వర్గాల సమాచారం ప్రకారం రేజర్ 70 అల్ట్రాతో పాటు ఎడ్జ్ 70 ఫ్యూషన్ , జీ 17, జీ 67, జీ 77 వంటి మోడల్స్ కూడా అదే డేటాబేస్‌లో లిస్ట్ అయ్యాయి. మోటరోలా కేవలం ఫోల్డబుల్ మార్కెట్ మీదనే కాకుండా, మిడ్-రేంజ్, ప్రీమియం సెగ్మెంట్లలో కూడా ఒకేసారి అటాక్ చేయడానికి పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది మే నెలలో లాంచ్ అయిన రేజర్ 60కి కొనసాగింపుగా ఈ రేజర్ 70 రానుంది. అప్పట్లో రేజర్ 60 సుమారు రూ.49,999 ధరకు అందుబాటులోకి వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు రాబోయే కొత్త మోడల్‌లో డిజైన్ పరంగా మరిన్ని మెరుగులు దిద్దడమే కాకుండా, పెర్ఫార్మెన్స్ విషయంలోనూ మేజర్ అప్‌గ్రేడ్స్ ఉండబోతున్నట్లు టాక్. ఇప్పటికే సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో, అతి త్వరలోనే దీని అఫీషియల్ లాంచ్ డేట్, ఇండియన్ ప్రైసింగ్ వివరాలు బయటకు రానున్నాయి. రేజర్ లో 6.9-ఇంచ్ FHD+ pOLED మెయిన్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కళ్లు చెదిరే విజువల్స్ అందిస్తుంది. ఇక ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు కనిపించే 3.63-ఇంచ్ కవర్ డిస్‌ప్లే కూడా మునుపటి కంటే స్మూత్‌గా ఉండబోతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400X చిప్‌సెట్, 8GB RAM, 256GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ మల్టీటాస్కింగ్‌లో అదరగొట్టనుంది. ఫోల్డబుల్ ఫోన్లలో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ సెటప్ ఉండనుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండటంతో ఫోటోలు అత్యంత నాణ్యంగా వస్తాయి. 4,500mAh బ్యాటరీతో పాటు 30W వైర్డ్ , 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ స్పెషాలిటీ. 

Post a Comment

0 Comments

Close Menu