Ad Code

ఏప్రిల్‌ 19 నుంచి చార్‌ ధామ్‌ యాత్ర ప్రారంభం


ప్రిల్‌ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు, ఏప్రిల్‌ 22న కేదార్​నాథ్​ ఆలయం, 23న బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. తెరుచుకోనున్నట్లు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. ప్రఖ్యాత చార్‌ ధామ్‌ పుణ్యక్షేత్రాల దర్శనానికి ఏటా వచ్చే భక్తుల కోసం దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ఈమేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్​నాథ్​ ఆలయాన్ని దాదాపు 6 నెలల తర్వాత తెరవనున్నారు. ఏప్రిల్‌ 22న ఉదయం 8 గంటలకు తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేసింది దేవస్థానం బోర్డు. అలాగే బద్రీనాథ్‌ ఆలయాన్ని ఏప్రిల్‌ 23న, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్‌ 19న తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నాలుగు ఆలయాలను మంచు కారణంగా మూసివేసిన తర్వాత ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో తిరిగి తెరుస్తుంటారు. ఉత్తరాఖండ్‌ లో ఉన్న బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్‌ నాథ్‌ ను చార్‌ ధామ్‌ అని పిలుస్తుంటారు. చార్‌ ధామ్‌ యాత్ర కోసం ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ యాత్ర సాధారణంగా హరిద్వార్, రిషికేష్ లేదా డెహ్రాడూన్ నుండి ప్రారంభమవుతుంది. యమునోత్రి.. గంగోత్రి.. కేదార్‌ నాథ్.. బద్రీనాథ్ ఇలా వరుస క్రమంలో దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ఆన్‌లైన్‌ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.


Post a Comment

0 Comments

Close Menu