కొత్త మహీంద్రా థార్ ROXX స్టార్ ఎడిషన్ విడుదల


హీంద్రా తన ప్రఖ్యాత SUV మోడల్ థార్ ROXX స్టార్ ఎడిషన్‌ను విడుదల చేసింది. కొత్త ఎడిషన్‌లో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్, ప్రీమియం ఇంటీరియర్ ఫినిషింగ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం అందించబడింది. ఆఫ్ రోడ్ సామర్థ్యాలను చాల ఎక్కువ స్ట్రాంగ్ కలిగి ఉండేలా ఈ SUV సాహసప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు . భారత మార్కెట్‌లో SUV విభాగంలో పోటీని నెలకొల్పే ఈ కొత్త థార్ ROXX స్టార్ ఎడిషన్ స్టైల్ , పవర్ తో ఉన్న కార్ గా చెప్పుకోవచ్చు. ఈ SUVలో 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్ , 2.2 లీటర్ mHawk టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ 177 PS పవర్ , 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్‌లో 4x4 175 PS పవర్,370 Nm టార్క్ , RWD 152 PS పవర్ , 330 Nm టార్క్ ను అందిస్తాయి. 6-స్పీడ్ మాన్యువల్ , 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో 19 అంగుళాల Piano Black అలాయ్ వీల్స్, పియానో బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, స్టార్ ఎడిషన్ బ్యాడ్జ్, ఆల్-బ్లాక్ లెదరెట్ ఇంటీరియర్ ఉన్నాయి. 26.03 cm ట్విన్ డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్ , అలెక్స , వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే , సరౌండ్ -వ్యూ కెమెరా , 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టం ఉన్నాయి. సేఫ్టీ పరంగా థార్ ROXX స్టార్ ఎడిషన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ABS, ESP ,ముందు& వెనుక పార్కింగ్ సెన్సర్లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM, ఇంపాక్ట్-సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ వంటి సౌకర్యాలు అందించబడ్డాయి. సిట్రిన్ యెల్లో, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, స్టీల్త్ బ్లాక్ వంటి కొత్త కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా థార్ ROXX స్టార్ ఎడిషన్‌ ప్రారంభ ఎక్స్ షో రూమ్ ధర Rs 16.85 లక్షలు. మహీంద్రా థార్ ROXX స్టార్ ఎడిషన్ SUV సెగ్మెంట్ లో శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, ఆధునిక ట్రాన్స్‌మిషన్ సిస్టమ్, ప్రీమియం ఇంటీరియర్, ప్రత్యేకమైన డిజైన్‌తో ఇది యువతకు, సాహసప్రియులకు, లైఫ్‌స్టైల్ SUV కొనుగోలుదారులకు చాల ఆకర్షణీయంగా ఉంటుంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, TPMS, పార్కింగ్ సెన్సర్లు, రియర్ కెమెరా వంటి ఫీచర్లు విశ్వాసాన్ని పెంచుతాయి. కొత్త రంగుల ఎంపికలు , ప్రత్యేక బ్యాడ్జ్ దీని ప్రత్యేకతను మరింతగా హైలైట్ చేస్తాయి. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains