జార్ఖండ్ లోని డియోఘర్ లో గోండా- అసన్ సోల్ ఎక్స్ ప్రెస్ ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటన రైల్వే గేటు వద్ద ఓ ట్రక్కు రూల్స్ కు విరుద్ధంగా రైలు పట్టాలను దాటుతుండగా జరిగింది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో ట్రక్కు డ్రైవర్ రైల్వే క్రాసింగ్ గుండా వెళ్లేందుకు యత్నించిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సిగ్నల్ లో సాంకేతిక లోపం కారణంగా రైల్వే గేటు వేయకపోయడంతో జార్ఖండ్ లోని డియోఘర్ లో రైలు ప్రమాదం సంభవించింది. ట్రక్కు- రైలు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. రైలు ఇంజిన్ భాగం కూడా దెబ్బతింది. ఈ ప్రమాద సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. రైలు ప్రమాదం కారణంగా ఆ రూట్ లోని పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన ఉదయం 9 గంటల 38 నిమిషాలకు జరిగింది. అయితే ఉదయం 10 గంటల 55 నిమిషాలకు ఈ లైన్ క్లియర్ అయింది. రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
0 Comments