Ad Code

పాట్నా ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సిగరెట్ తాగిన ఎమ్మెల్యే అనంత్ సింగ్ !


బీహార్ కు చెందిన జేడీ (యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఓ ఆస్పత్రిలో అందరిముందూ సిగరెట్ తాగడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వైద్య పరీక్షలకు హాజరైన ఎమ్మెల్యే అనంత్ సింగ్ అక్కడ అందరిముందూ సిగరెట్ తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ మొకామా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్‌ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్ అరెస్టయ్యారు. అయితే తాజాగా వైద్య పరీక్షల కోసం పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్) కు వెళ్లినప్పుడు అక్కడ బహిరంగంగానే ఎమ్మెల్యే అనంత్ సింగ్ సిగరెట్ తాగారు. అప్పుడు ఆయన చుట్టూ అనుచరులు, సిబ్బంది ఉన్నారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటుగా ఎమ్మెల్యే అనంత్ సింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశం కావడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్జేడీ అధికార ప్రతినిధి ప్రియాంక భారతి తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్టు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ కు అత్యంత సన్నిహితుడైన అనంత్ సింగ్ సిగరెట్ పొగతో బీహార్‌ లో సుపరిపాలనను తీసుకొస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu