Ad Code

టాయిలెట్‌లో మొబైల్‌ ఫోన్‌ను గమనించిన పోలీస్‌ అధికారిణి : మొబైల్‌ ఎస్‌ఎస్‌ఐదిగా గుర్తించి సస్పెండ్ చేసిన అధికారులు


మిళనాడులోని రామనాథపురం జిల్లాలో జనవరి 17న సీఎం ఎంకే స్టాలిన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఇద్దరు పోలీస్‌ అధికారులు విధుల్లో ఉన్నారు. కాగా, పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ వద్ద తాత్కాలికంగా టాయిలెట్‌ ఏర్పాటు చేశారు. ఒక మహిళా పోలీస్‌ అధికారిణి ఆ టాయిలెట్‌లోకి వెళ్లగా అక్కడ ఒక మొబైల్‌ ఫోన్‌ కనిపించింది. దీంతో ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆ మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళా పోలీస్‌ అధికారిణితో పాటు విధుల్లో ఉన్న సీనియర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఎస్‌ఐ)కు చెందిన మొబైల్‌ ఫోన్‌గా గుర్తించారు. మరోవైపు ఆ మొబైల్‌ ఫోన్‌లో ఎలాంటి వీడియో రికార్డ్‌ లేదని పోలీసులు తెలిపారు. ఆ పోలీస్‌ అధికారిని సస్పెండ్‌ చేయడంతోపాటు అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ ఉన్నతాధికారి చెప్పారు. పూర్తి దర్యాప్తు తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సంఘటన తమిళనాడులో రాజకీయ దుమారాన్ని రేపింది. అధికార డీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలైన ఏఐఏడీఎంకే, బీజేపీ మండిపడ్డాయి. మహిళలను కాపాడాల్సిన పోలీసులే ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో శాంతి, భద్రతల అంశంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి.

Post a Comment

0 Comments

Close Menu