మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో త్రాగు నీరు కాలుష్యం అయిన ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, సుమారు 1500 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భాగీరథ్‌పురలో జరిగిన నీటి కాలుష్యం ఘటన గురించి ఎన్డీటీవీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మంత్రి కైలాశ్ విజయవర్గీయా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. నోరుజారి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి విజయవర్గీయా క్షమాపణలు చెప్పారు. తన ఎక్స్ అకౌంట్‌లో స్పందిస్తూ తనతో పాటు తన బృందం ప్రభావిత ప్రాంతంలో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. మంత్రి విజయవర్గీయా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. భాగీరథ్‌పురకు నీళ్లు సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్ సమీపంలో ఉన్న టాయిలెట్ లీకేజీ అవడం వల్ల ఆ ప్రాంతానికి సరఫరా అయిన నీళ్లు కలుషితం అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి బిల్లులు ఎందుకు చెల్లించలేదని, ప్రత్యామ్నాయ మంచినీటి సౌకర్యాన్ని ఎందుకు కల్పించలేదని జర్నలిస్టు ప్రశ్న వేశారు. అయితే అనవసర ప్రశ్నలు వేయకండి అన్న మంత్రి ఆ తర్వాత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఇండోర్‌లో త్రాగు నీరు కాలుష్య ఘటన : అభ్యంతరకర వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన మంత్రి
Thursday, January 1, 2026
13 people have died so far and over 1500 people have fallen seriously ill Indore Drinking Water Contamination Incident madyapradesh Minister Apologizes for Objectionable Remarks
No comments:
Post a Comment