Ad Code

సానియా చందోక్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అర్జున్ టెండూల్కర్


ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే 2025 ఆగస్టులో అర్జున్-సానియా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఇరు కుటుంబాలు ప్రైవేట్‌గా వేడుకలు జరుపుకుంటూ వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ఇరు కుటుంబాల చర్చల అనంతరం పెళ్లి తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 3 నుంచి వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని, మార్చి 5న అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu