Ad Code

కన్న బిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నే గ్రామంలో మద్యం మత్తులో తండ్రే తన ముగ్గురు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం ప్రకారం వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేసిన అనంతరం సురేంద్ర ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు కావ్య (7), ధ్యానేశ్వరి (4), సూర్య గగన్ (2)గా గుర్తించారు. ఒక్కసారిగా ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల తల్లి 8 నెలల క్రితమే మరణించినట్లు సమాచారం. ఈ ఘటన విషయం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని స్థానికులు చెబుతుండగా, పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu