Ad Code

అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి


ర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవల సక్సెస్ సాధించిన దర్శకులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వడం చిరంజీవి ఆనవాయితీగా మారిన సంగతి తెలిసిందే. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్‌కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును అనిల్ రావిపూడికి గిఫ్ట్‌గా ఇచ్చారు మెగాస్టార్. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ గిఫ్ట్‌కు సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి నెట్టింట వేగంగా వైరల్‌గా మారాయి. చిరంజీవి నుంచి ఈ విలువైన కానుక అందుకోవడంతో అనిల్ రావిపూడి ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు కొన్ని సరదా సూచనలు కూడా చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని సూచించగా, కారు నచ్చిందా? అని అడిగారు. దీనిపై అనిల్ స్పందిస్తూ "మెగా బహుమతి మహదానందం, మనోధైర్యం… ధనాధన్" అంటూ సరదాగా స్పందించి అక్కడున్న వారిని నవ్వించారు. గత దశాబ్ద కాలంలో తొమ్మిది సినిమాలు తెరకెక్కించిన అనిల్ రావిపూడి, టోటల్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. 'ఎఫ్ 3'కు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ఆయన సినిమాలపై వచ్చే ట్రోల్స్‌ను తట్టుకుంటూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి బాటలో వెళ్లి ప్రేక్షకులకు వినోదం పంచారు.

Post a Comment

0 Comments

Close Menu