Ad Code

అమెరికా రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దంపతుల దుర్మరణం


మెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ కొటికలపూడి కృష్ణ కిషోర్, అతని భార్య ఆశ దుర్మరణం చెందారు. కృష్ణ కిషోర్, గత దశాబ్దం కాలంగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంజనీర్ గా పని చేస్తున్నారు. పది రోజుల క్రితం గ్రామానికి వచ్చి తిరిగి అమెరికాకు వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో భాగంగా దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని ప్రయాణం కొనసాగించారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయపడిన వారి కుమారుడు, కుమార్తె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కుటుంబం సభ్యులు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu