Ad Code

చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ


తెలంగాణాలో చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు చేనేత కార్మికులపై ఉన్న లక్ష రూపాయల వరకు రుణాలను పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఈ చర్య ద్వారా వారిపై ఉన్న అప్పుల భారాన్ని తొలగించి వారికి ఆర్థికంగా భరోసా ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం వివిధ రంగాలలో ఉన్న వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో కూడా చేనేత వృత్తి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలలో ఇందిరమ్మ చీరల పథకం, చేనేత భరోసా, పొదుపు పథకం వంటి పథకాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు గా మంత్రి తుమ్మల స్పష్టం చేశారు ఒక పక్కన చేనేత కార్మికులకు పని కల్పించడం మాత్రమే కాక, వారికి అనేక రాయితీలను ప్రకటించి ఊరట కల్పిస్తున్నట్టు తెలిపారు. 2017 నుంచి 2024వరకు రుణమాఫీ కోసం మొత్తం 27.14కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 6784మంది చేనేత కార్మికులు నేరుగా ప్రయోజనం పొందారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రుణమాఫీ ప్రక్రియతో పాటుగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం, ఉపాధి భద్రత కోసం ఇతర పథకాలను కూడా అమలు చేస్తున్నామని, ప్రభుత్వ అడుగడుగునా నేతన్నలకు అండగా నిలుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. నేతన్నల భవిష్యత్తు అవసరాల కోసం అమలు చేస్తున్న చేనేత భరోసా మరియు పొదుపు పథకం కింద సుమారు 303 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఇక చేనేత కార్మికులు తీసుకునే రుణాలపైన వడ్డీ భారం లేకుండా పావలా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో భాగంగా టెస్కో ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికులకు భరోసా కల్పిస్తోంది. ఇప్పటివరకు 587 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu