ఉద్యోగులు కచ్చితంగా వారానికి ఐదు రోజులు ఆఫీస్ కు రావాల్సిందేననే నిబంధనను టీసీఎస్ కఠినంగా అమలు చేస్తోంది. ఈ పాలసీని పట్టించుకోని ఉద్యోగుల విషయంలో కంపెనీ ఎలాంటి రిలీఫ్ ఇవ్వడం లేదు. ఆఫీస్ అటెండెడ్స్ కేవలం జీతానికి సంబంధించిన అంశంగా మాత్రమే కాకుండా, ఉద్యోగుల పనితీరు రివ్యూలో కూడా కీలక ప్రమాణంగా మారిందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో గత కొన్ని క్వార్టర్స్ లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రూల్స్ పాటించని ఉద్యోగుల అప్రైజల్స్‌ను టీసీఎస్ నిలిపివేసింది. అప్రైజల్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఆఫీస్ కు రాకపోతే శాలరీ హైక్, ప్రమోషన్లు అందవని కంపెనీ ఇంటర్నల్ టాక్. దీంతో పలువురు ఉద్యోగులకు కెరీర్ పరంగా అనూహ్యమైన బ్రేక్ పడింది. అంతేకాదు, అటెండెన్స్‌కు లింక్ అయ్యే వేరియబుల్ పే, పెర్ఫార్మెన్స్ బ్యాండ్స్ వంటి అంశాలను కూడా కంపెనీ కంట్రోల్ చేస్తుంది. వ్యక్తిగత అవసరాల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే మినహాయింపులు ఇస్తుండగా, నెట్‌వర్క్ సమస్యలు వంటి కారణాలను ఆధారంగా చూపడాన్ని కూడా కంపెనీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇది ఉద్యోగుల్లో మరింత ఒత్తిడిని పెంచుతోంది.
0 Comments