ఐదు ప్రధాన హామీలతో మేనిఫెస్టోను ప్రకటించిన అన్నాడీఎంకే పార్టీ


మిళనాడులో అన్నాడీఎంకే పార్టీ తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఐదు ప్రధాన హామీలతో మేనిఫెస్టోను అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి విడుదల చేశారు. మరోవైపు విజయ్ టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రచార కమిటీని టీవీకే అధ్యక్షుడు విజయ్ ఏర్పాటు చేశారు.  తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ తాజాగా తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. 5 ప్రధాన హామీలతో మేనిఫెస్టోను అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి విడుదల చేశారు. వీటిలో మహిళల సంరక్షణ కోసం కులవిలక్కు పథకం. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన మహిళలకు ప్రతినెలా రూ. 2 వేలు అందించనున్నట్లు మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఈ సాయాన్ని అర్హులైన మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చారు. మరో పథకంలో భాగంగా పురుషులకు ఫ్రీ బస్సు ప్రయాణం ఉంటుందని తెలిపింది. మహిళలతోపాటుగా పురుషులకూ ఉచిత బస్సు సేవలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే అమ్మ ఇల్లమ్ స్కీమ్ కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక రూరల్ ఎంప్లాయిమెంట్ పథకం కింద ఇప్పటివరకూ కేంద్రం ఇస్తున్న 125 ఉపాధి హామీ పని దినాలను 150 రోజులకు పెంచనున్నట్లు అన్నాడీఎంకే పార్టీ తెలిపింది. అమ్మా టూవీలర్ స్కీమ్ కింద అర్హులైన 5 లక్షల మంది మహిళలకు రూ. 25 వేల సబ్సిడీ కింద టూ వీలర్లు అందిస్తామని పేర్కొంది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం