ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శంచారు. ఈరోజు విశాఖ నుంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ 'కూటమి నేతలకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి. కూటమి పాలనలో అంతా ఇబ్బందులు పాలవుతున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నేతల దగ్గర మాత్రం యూరియా ఉంటుంది. దాన్ని వారు బ్లాక్ మార్కెట్‌లో అత్యధిక ధరకు అమ్ముకుంటున్నారు. కూటమి నేతలు బ్లాక్ మార్కెట్‌లో విచ్చలవిడగా యూరియా అమ్ముతున్నారు. పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతుల తరఫున ప్రభుత్వమే పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించింది తక్షణమే ప్రభుత్వం పంటలకు ఇన్సూరెన్స్ చెల్లించాలి' అని డిమాండ్ చేశారు.
0 Comments