Ad Code

జనవరి 29న రియల్‌మి P4 పవర్‌ విడుదల ?


దేశీయ మార్కెట్లో రియల్‌మి P4 పవర్‌ విడుదల కానుంది. ఈ ఫోన్‌ విడుదలపై రియల్‌మి ఇప్పటికే ప్రకటన చేసింది. దీంతోపాటు అనేక స్పెసిఫికేషన్‌ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఫ్లిప్ కార్ట్‌ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ సేల్‌ ప్రారంభం కానున్నది. తాజాగా టిప్‌స్టర్‌ సంజు చౌదరి రియల్‌మి P4 పవర్‌ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర సహా అనేక వివరాలను లీక్‌ చేశారు. ఈ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 10,001mAh భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. రియల్‌మి P4 పవర్‌ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్‌ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు AI చిప్‌, హైపర్‌విజన్‌ చిప్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని భావిస్తున్నారు. దీనితో వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌  సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్, ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాలతో లాంచ్‌ కానుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 219 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఆరెంజ్‌, సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ముందు వైపు గ్లాస్, వెనుక వైపు ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. రియల్‌మి P4 పవర్ స్మార్ట్‌ఫోన్‌ జనవరి 29 వ తేదీన విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. అయితే రియల్‌మి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. 

Post a Comment

0 Comments

Close Menu