వందేమాతరం ఈ ఏడాదితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు హైదరాబాద్ లో కీరవాణి తన టీమ్ తో కలిసి ఓ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్నీ ఆయనే సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు సంగీత దర్శకుడు కీరవాణి ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆ అద్భుత ప్రదర్శన జనవరి 26న రిపబ్లిక్ డే రోజున జరగనుంది. జాతీయ గీతం అయిన వందేమాతరం ఈ ఏడాదితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకోనుండటంతో దానిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో 150 సంవత్సరాల వందేమాతరంపై కీరవాణి పరేడ్ కి ప్రత్యేకమైన మ్యూజిక్ ను అందించబోతున్నారు. ఇక డియర్ ఆల్, వందేమాతరం ! ఐకానిక్ పాట వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంగీతం అందించడం నాకు చాలా గౌరవంగా అలాగే అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గొప్ప ప్రదర్శనను భారతదేశం అంతటా 2,500 మంది కళాకారులు ప్రదర్శిస్తారు. మన దేశం యొక్క స్ఫూర్తిని జరుపుకోవడానికి మనం కలిసి వచ్చినప్పుడు వేచి ఉండండి అంటూ కీరవాణి రాసుకొచ్చారు. ఈ ప్రదర్శనలో 2500 మంది కళాకారులు పాల్గొననుండటంతో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. 1887లో బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచిన మన జాతీయ గీతం ఈ ఏడాదితో 150 వసంతాలు పూర్తి చేసుకుంది.
0 Comments