Ad Code

జనవరి 23న మోటోరోలా సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల


గ్లోబల్‌ మార్కెట్‌లో గత వారం మోటోరోలా సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. అయితే భారత్‌లో లాంచ్‌ సహా ధర, స్పెసిఫికేషన్‌ల వివరాలపై మోటోరోలా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ ఫోన్‌ గురించి కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. మోటోరోలా సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్‌ జనవరి 23 వ తేదీ న భారత్‌ మార్కెట్లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. టిప్‌స్టర్‌ సంజు ఛౌదరి ఈ వివరాలను వెల్లడించారు. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్‌ మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ గ్లోబల్‌ వేరియంట్ 6.8 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 165Hz రీఫ్రెష్‌ రేట్, 6200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, డాల్బీ విజన్‌, HDR10+ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 16GB LPDDR5x ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. మోటో ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ గ్లోబల్‌ వేరియంట్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 828 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 122 డిగ్రీల ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూతో 50MP అల్ట్రావైడ్‌ లెన్స్, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP సోనీ LYT 600 పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సోనీ LYT 500 కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 90W వైర్‌, 50W వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. 10W రివర్స్‌ వైర్‌, 5W రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.మోటోరోలా సిగ్నేచర్‌ గ్లోబల్‌ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌, Bose సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu