రూ.1,284 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన


తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ.1,284 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వెనుకబడిన మండలం ఈ జిల్లాలోని గట్టు అని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టును 2013లో అప్పటి కాంగ్రెస్‌ నేతలు సాధించారని, ప్రాజెక్టు పేరు మీద రూ.23 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఉద్ధండాపూర్‌ జలాశయం భూ నిర్వాసితులకు నిధులు చెల్లించలేదని, సంగంబండ వద్ద బండ పగులగొట్టేందుకు కేసీఆర్‌ పదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. నారాయణపేట`కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారని, గతంలో పాలమూరు జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జిల్లాలోని ప్రాజెక్టుల గురించి అడగలేదని విమర్శించారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే సభకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలు రాష్టాన్రికి ఐఐఎం సాధిస్తే పాలమూరు జిల్లాలోనే భూమి ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. పాలమూరు జిల్లాను వెనకబడిన జిల్లాగా ఇంకా ఎన్నాళ్లు చూపించాలి అని ప్రశ్నించారు. పదేళ్లలో రూ.1.80లక్షల కోట్లు ఖర్చు చేశారు కానీ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటి పూర్తి చేశారు.. అది కాస్తా మూడేళ్లకే కుప్పకూలిందన్నారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో 3.50 కోట్ల మంది పేదలకు రేషన్‌ కార్డులపై సన్న బియ్యం ఇస్తున్నాం.. గతంలో పదేళ్లపాటు పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది అని సీఎం వివరించారు. బూర్గుల రామకృష్ణా రావు తరవాత 75 ఏళ్లకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాకు విద్య, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం మారుమూల పల్లె నుంచి వచ్చిన తాను 17 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయ్యానని, మంత్రిని కాకపోయినా అందరి సహకారంతో సీఎం అయ్యానని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నానని చెప్పారు. మారీచ, సుబాహులు ఏ రూపంలో వచ్చినా ఈసారి ప్రజలు తరిమికొడతారని అన్నారు. గతంలో భూస్వాములు, దొరల వద్ద లక్షలాది ఎకరాలు ఉండేవని, భూగరిష్ఠ భూ పరిమితి చట్టం తెచ్చి మిగులు భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు పంచిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పేదలకు పంచేందుకు ప్రభుత్వం వద్ద భూమి లేదని, ఇప్పుడు చేయగలిగింది మంచి విద్య అందించటమేనని అన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఇప్పటికీ జీవనాధారం అయ్యాయన్నారు. భారత తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని, తమ ప్రభుత్వం కూడా వాటికే ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, చిట్టబోయినపల్లిలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. చదువే అన్నిటికీ మూలమని, విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. నిబద్ధత లేని చదువు వల్ల ప్రయోజనం ఉండదని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని, 25 ఏళ్లు కష్టపడి చదివితే 75 ఏళ్ల వరకు గౌరవంగా జీవించవచ్చని ఉద్బోధించారు. విద్య మన సమస్యలకు పరిష్కారం చూపుతుంది.. విద్యలో రాణించాలని విద్యార్థులకు, యువతకు ఉద్బోధించారు. జీవితంలో పైకి రావాలంటే పట్టుదలతో కష్టపడి పనిచేయాలని సూచించారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మిస్తున్నామని చెప్పారు. చదువు వల్లనే అవకాశాలు వస్తాయని, భవిష్యత్‌ కూడా చదువు మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు అన్ని విద్యా సంస్థలను తీసుకొస్తున్నామని, నిబద్ధత లేని చదువు జీవితానికి ఉపయోగం ఉండదని చెప్పారు. సివిల్స్‌కు హాజరయ్యే వారికి కూడా ఆర్ధిక సహాయం చేస్తున్నామంటూ ఏడాదిలో ఇక్కడ ఐఐఐటీ భవనాన్ని సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులను అందరూ గౌరవించుకోవాలన్నారు.మహబూబ్‌ నగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఎం.వి.ఎస్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో రూ.200 కోట్లతో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలకు, రూ.20.50 కోట్లతో డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. యూఐడీఎఫ్‌ నిధులతో నగర పాలక సంస్థ పరిధిలో రూ.220.94 కోట్లతో తాగు నీటి శుద్ధి కేంద్రం పనులకు శంకుస్థాపన..యూఐఎఫ్‌డీ నిధులతో నగర పాలక సంస్థ పరిధిలో రూ.603 కోటతో చేపట్టనున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు సీఎం రేవంత్‌ శంకుస్థాప చేశారు. అలాగే రూ.40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్‌ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains