Ad Code

డివైడర్‌ను ఢీకొని లోయలో పడిన హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా : ముగ్గురి మృతి


ఆంధ్రప్రదేశ్ లోని  కడప నుండి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. బెంగళూరు వైపు ప్రయాణిస్తున్న బస్సు మంచినీళ్ల కోట సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు, గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0 Comments

Close Menu