Ad Code

పెరగనున్న ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు


దేశంలో పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ఎలక్ట్రానిక్ విడిభాగాల వ్యయం కారణంగా అన్ని మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు ఏథర్ ఎనర్జీ సంస్థ వెల్లడించింది. ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను సుమారు రూ.3,000 వరకు పెంచాలని నిర్ణయించింది.  ధరల పెరుగుదల కంటే ముందే స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ డిసెంబర్ నెల ఉత్తమ సమయం. ఏథర్ ప్రస్తుతం తన కస్టమర్లకు రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్స్, క్యాష్ ఇన్సెంటివ్స్, కొన్ని మోడళ్లపై 8 ఏళ్ల వరకు బ్యాటరీ వారంటీలతో పాటు ఆకర్షణీయమైన ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. ఏథర్ ఇటీవల విడుదల చేసిన 'రిజ్తా' ఫ్యామిలీ స్కూటర్ దేశవ్యాప్తంగా  ఇప్పటికే 2 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని దాటింది. 56 లీటర్ల స్టోరేజ్ స్పేస్, వెడల్పు సీటు, 'స్కిడ్ కంట్రోల్' వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లతో ఇది మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకుంటోంది. 

Post a Comment

0 Comments

Close Menu