సినీ దర్శకుడు కీర్తన్ కుమారుడు సోనార్ష్ పొరపాటున లిఫ్ట్‌లో ఇరుక్కోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. పలువురు సినీ ప్రముఖులు చిన్నారికి నివాళులు అర్పిస్తూ కీర్తన్, సమృద్ధి దంపతులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కేజీఎఫ్ వంటి హిట్ సినిమాకు ప్రశాంత్ నీల్ వద్ద సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా కీర్తన్ పనిచేశారు. కొద్దిరోజుల క్రితమే ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హారర్ చిత్రానికి ఆయన దర్శకత్వం వస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు.
0 Comments