టయోటా కిర్లోస్కర్ మోటార్ సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ 'మిరాయ్'ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కి అప్పగించింది. దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇదెలా పనిచేస్తుందనే విషయాన్ని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ జీరో ఎమిషన్ వాహనాల్లో టయోటా మిరాయ్ ఒకటి. ఈ కారు హైడ్రోజన్ & ఆక్సిజన్ మధ్య జరిగిన రసాయన చర్య ద్వారా ఏర్పడిన విద్యుత్తు ద్వారా పనిచేస్తుంది. నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇది సుమారు 650 కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే.. సాధారణ ఫ్యూయెల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లకు ఇది ప్రత్యామ్నాయమనే చెప్పాలి. కంపెనీ కూడా ఈ లేటెస్ట్ మిరాయ్ కారును.. ఇంధన సామర్థ్యం, పరిధి, డ్రైవింగ్ సామర్థ్యం, భారతదేశ విభిన్న భూభాగాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా తయారు చేసింది. ఈ కారు టెస్టింగ్ పూర్తయిన తరువాత అన్నింటా సక్సెస్ సాధిస్తే త్వరలోనే రోడ్డుపైకి వస్తుంది.
0 Comments