మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో రైల్వే ట్రాక్ పై రీల్స్ తీస్తుండగా ప్యాసింజర్ రైలు ఢీకొని ఇద్దరు టీనేజర్లు మృతి చెందారు. మంగళవారం బిరాఖేడి రైల్వే క్రాసింగ్ సమీపంలోని ట్రాక్ పై ఈ ప్రమాదం జరిగింది. 16 ఏళ్ల ఇద్దరు బాలురు అలోక్, సన్నీ యోగి మృతి చెందారు. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారని ఆ ప్రాంత పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు బాలురు చాలా కాలంగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. స్థానికులకు వారు సుపరిచితులు. కొత్త రీల్ నిర్మాణంలో భాగంగా వారు ట్రాక్ పై చిత్రీకరణ చేస్తున్నారు. రెండు ట్రాక్ లపై రైళ్లు వస్తున్నప్పుడు చిత్రీకరణ జరిగింది. కానీ ఎదురుగా ఇండోర్-బిలాస్ పూర్ రైలు వేగంగా వస్తున్నట్లు వారు గమనించలేదు. దీంతో ప్యాసింజర్ రైలు ఢీకొని ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.
0 Comments