టాటా సియెర్రా ఆధునిక రూపంలో తిరిగి మార్కెట్‌కు తీసుకువచ్చింది. నవంబర్ 25న అధికారికంగా కొత్త టాటా సియెర్రా SUVను ఆవిష్కరించింది. టాటా మోటార్స్ డిసెంబర్ 16 నుంచి కొత్త సియెర్రా SUV కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కారు కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నవారు తమ సమీపంలోని టాటా డీలర్‌షిప్‌ను సందర్శించి లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ. 21,000 ముందస్తు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. దీని డెలివరీలు జనవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇతర కంపెనీల అదే సెగ్మెంట్ కార్లతో పోలిస్తే, కొత్త టాటా సియెర్రా SUV ధర పరంగా కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. టాటా మోటార్స్ ఈ మోడల్‌ను పోటీ ధరలతో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌లో రూ. 21.29 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర శ్రేణిలో లభించే ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్‌లను చూస్తే, సియెర్రా నిజంగా విలువైన SUVగా కనిపిస్తోంది. కొత్త టాటా సియెర్రా మొత్తం ఆరు ఆకర్షణీయమైన వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ అనే పేర్లతో మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రతి వేరియంట్‌ను వేర్వేరు వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ రూపొందించింది. అందువల్ల ప్రాథమిక మోడల్ నుంచి లగ్జరీ ఫీల్ ఇచ్చే టాప్ వేరియంట్ వరకు వినియోగదారులకు విస్తృత ఎంపిక లభిస్తుంది. మూడు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్‌లతో వస్తోంది. మొదటిగా 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 106 bhp పవర్‌తో పాటు 145 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రోజువారీ వినియోగానికి సరిపడే స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందించేలా రూపొందించబడింది. ఈ పెట్రోల్ ఇంజన్‌కు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఎక్కువ పవర్ కోరుకునే వినియోగదారుల కోసం టాటా మోటార్స్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఈ ఇంజన్ 160 bhp హార్స్‌పవర్, 255 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. డీజిల్ వేరియంట్‌ను ఇష్టపడే వినియోగదారుల కోసం సియెర్రాలో ఒక శక్తివంతమైన ఆప్షన్ ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 118 bhp పవర్‌తో పాటు 260 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
0 Comments