Ad Code

త్వరలో టాటా అవిన్యా ఎలక్ట్రిక్ కారు విడుదల ?


దేశీయ మార్కెట్లోకి టాటా మోటార్స్ అవిన్యా ఎలక్ట్రిక్ కారును తీసుకు రాబోతోంది. తొలిసారిగా కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన అవిన్యా, టాటా ప్రస్తుత EVల కంటే ప్రీమియం స్థాయిలో మార్కెట్‌లో నిలవనుంది. ప్రత్యేకంగా EVల కోసం రూపొందించిన బోర్న్ - ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ పై అవిన్యా నిర్మితమైతుది. స్పేస్, ఎనర్జీ ఎఫిషియెన్సీ, అడ్వాన్స్ టెక్నాలజీ ప్రధాన లక్ష్యాలుగా టాటా దీనిని అభివృద్ధి చేస్తోంది. ఇది టాటా మోటార్స్ రూపొందించిన డెడికేటెడ్ EV ఆర్కిటెక్చర్ ఆధారంగా వస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ భవిష్యత్తులో వివిధ బాడీ స్టైల్స్, బ్యాటరీ వేరియంట్స్‌కు మద్దతు ఇవ్వనుంది. ఫ్లాట్ ఫ్లోర్ డిజైన్, తక్కువ ఓవర్‌హ్యాంగ్స్, పెద్ద క్యాబిన్ స్పేస్, ఎనర్జీ సేవింగ్ టెక్ ఈ వేరియంట్ యొక్క ప్రధాన బలాలు. అవిన్యా బ్యాటరీ సామర్థ్య వివరాలను టాటా ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ, ఈ మోడల్ గ్లోబల్ EV బెంచ్‌మార్క్స్‌కు అనుగుణంగా అధిక రియల్-వరల్డ్ రేంజ్ ఇవ్వగలదని అంచనా.

Post a Comment

0 Comments

Close Menu