పిల్లలకు చిన్న వయస్సులోనే ఫోన్ ఇస్తే వారు అనేక నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అలాంటి పిల్లలలో నిద్ర లేకపోవడం, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మొబైల్ ఉపయోగించే వ్యసనం ఉంటే వారిలో నిద్ర సమస్యలు, బరువు పెరగడం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నట్లు తేలింది. అధ్యయనం ప్రకారం ఫోన్ కారణంగా పిల్లల దినచర్య దెబ్బతింటుంది. దీనివల్ల ఇతర సమస్యలు మొదలవుతాయి. ఫోన్ ఉన్న పిల్లలు రాత్రిపూట స్క్రోలింగ్ చేస్తూ తక్కువ నిద్రపోతారు. స్క్రీన్ సమయం కారణంగా శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీనితో పాటు సోషల్ మీడియాలోని నెగిటివ్ కంటెంట్ పిల్లల మనస్సుపై ప్రభావం చూపుతుంది. దానిని వారి మనస్సు అర్థం చేసుకోవట్లేదని. దీనివల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించారు. అధ్యయనంలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫోన్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నారని.. కానీ వారు సోషల్ మీడియాలో చూసే కంటెంట్ ఇంపాక్ట్ వారిపై రకారకాలుగా ఉంటుందని తెలిపారు. చిన్న వయస్సులోనే స్మార్ట్ఫోన్ ఇస్తే వారికి నైపుణ్యాలు అభివృద్ధి చెందవని తెలిపారు. భద్రత లేదా ఆన్లైన్ స్టడీ వంటి ఇతర కారణాల వల్ల చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారు. అలాంటి పేరెంట్స్ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వారి నుంచి ఫోన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మొబైల్ యాప్స్ కంట్రోల్ పేరెంట్స్ సెట్ చేయాలని.. సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచాలని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో రీచ్ కోసం చాలామంది పేరెంట్స్ తమ పిల్లల ప్రైవసీని సోషల్ మీడియాలో పెడుతున్నారని.. అది ఏమాత్రం మంచిది కాదని.. పిల్లల సేఫ్టీ కూడా దీనిపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు.
0 Comments