Ad Code

నైట్ క్లబ్‌లో జరిగిన ప్రమాదం తీవ్రతకు కారణం రెండు గేట్లు, కలప ఫర్నీచర్ !


గోవాలోని ది బిర్చ్ బై రొమియో లేన్  నైట్ క్లబ్‌లో జరిగిన ప్రమాదం తీవ్రతకు, మృతుల సంఖ్య పెరగడానికి రెండు గేట్లు మాత్రమే ఉండడంతో పాటు కలప ఫర్నీచర్‌ ద్వారా మంటలు వ్యాపించడమే కారణమని పోలీసులు తెలిపారు. అయితే ముందుగా అనుకున్నట్టు సిలిండర్ పేలుడు ప్రమాదానికి కారణం కాదని పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 23 మంది మృతదేహాలపై ఎలాంటి కాలిన గాయాలు లేవని, కేవలం ఇద్దరి మృతదేహాలే బాగా కాలిపోయాయని పోలీసులు తెలిపారు. ఆక్సిజన్ కొరత, ఊపిరాడకపోవడం కారణంగానే వీరంతా మరణించారని పేర్కొన్నారు. 17 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించామని, ఆరుగురి మృతదేహాలను అంత్యక్రియల కోసం వారి కుటుంబసభ్యులకు అప్పగించామని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి భద్రతా వైఫల్యం కూడా కారణమని దర్యాప్తులో తేలింది. దాంతో భద్రతా నియమాలను ఉల్లంఘించినందున ఇప్పటివరకూ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. నైట్ క్లబ్ యజమాని కోసం గోవా పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu