Ad Code

తెలంగాణలో రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడి !


భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ  రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమధుర గ్రూప్ రూ.600 కోట్ల పెట్టుబడికి సంబంధించి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. రాబోయే రెండు సంవత్సరాల కాలంలో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 100 ఎకరాల్లో గ్రేడ్ A+ పార్క్‌ను రెండు సంవత్సరాల్లో నిర్మించి, 8 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఏరోస్పేస్, ఆటో, ఫార్మా, ఇ-కామర్స్ రంగాలకు ఈ గ్రూప్ ఇది ఆధునిక సదుపాయాలను అందిస్తుంది. ఈ కొత్త పారిశ్రామిక పార్క్.. ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, ఇ-కామర్స్ రంగాలకు అవసరమైన అత్యాధునిక ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలను అందించనుంది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఈ పార్క్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో మాడ్యులర్ తయారీ బ్లాక్‌లు,లాజిస్టిక్స్ జోన్‌లు, గ్రీన్ డెవలప్‌మెంట్ ప్రమాణాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu