2026లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రేజీ స్పోర్ట్స్ బైక్స్ రిలీజ్ చేయనుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఇవి ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఐకానిక్ బుల్లెట్ మోడల్‌ను ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ 650cc ప్లాట్‌ఫారమ్‌పై డెవలప్ చేస్తోంది. ఇది 2026లో మార్కెట్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. క్లాసిక్ రిట్రో డిజైన్, సింగిల్ పీస్ సీటు, సిగ్నేచర్ బుల్లెట్ బ్యాడ్జింగ్‌తో వస్తుంది. 648cc ఇంజన్ (46bhp), LED హెడ్‌లైట్, డ్యుయల్ ఛానల్ ABS, స్లిప్పర్ క్లచ్ లాంటి ఫీచర్లు దీంట్లో ఉంటాయి. బుల్లెట్ 650 ధర రూ.2.80 లక్షల నుంచి రూ.3.50 లక్షల రేంజ్‌లో ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి రాబోతున్న మోస్ట్ పవర్‌ఫుల్ అడ్వెంచర్ బైక్ హిమాలయన్ 750. ఇందులో 750cc ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది దాదాపు 55bhp పవర్, 65Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అడ్జస్టబుల్ సస్పెన్షన్, టిఎఫ్‌టి డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. హిమాలయన్ 750 ధర రూ.5 లక్షల నుంచి రూ.5.60 లక్షల వరకు ఉంటుందని అంచనా. కెఫే రేసర్ స్టైల్‌ను ఇష్టపడే వారి కోసం ఈ 750cc బైక్ రెడీ అవుతోంది. ఇది ప్రస్తుతం ఉన్న GT 650 కంటే ఎక్కువ స్పీడ్, పవర్‌ను జనరేట్ చేస్తుంది. రేసింగ్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన GT-R 750 వెర్షన్ కూడా ఈ లైనప్‌లో ఉండవచ్చు. 57bhp పవర్, డ్యుయల్ డిస్క్ సెటప్, రిట్రో స్టైల్ బాడీ వర్క్ లాంటి ఫీచర్లు దీని సొంతం. కాంటినెంటల్ GT 750 ధర రూ.3.80 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుంచి రాబోతున్న సరికొత్త 'సిటీ+ ఎలక్ట్రిక్' స్క్రాంబ్లర్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ S6. దీని బ్యాటరీ కెపాసిటీ 4kWh నుంచి 5kWh మధ్య ఉండే అవకాశం ఉంది. తక్కువ బరువుతో వచ్చే ఈ వెహికల్ పట్టణ ప్రయాణాలకు, చిన్నపాటి ఆఫ్-రోడింగ్‌కు సెట్ అవుతుంది. రౌండ్ TFT డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, లీన్-సెన్సింగ్ ABS, వాయిస్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు దీంట్లో ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ S6 ధర రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే మొట్టమొదటి అడ్వెంచర్ బైక్ హిమాలయన్ ఎలక్ట్రిక్. ఈ పవర్‌ఫుల్ బైక్ 14kWh బ్యాటరీ ప్యాక్‌తో సుమారు 200 కి.మీ రేంజ్ ఇస్తుందని అంచనా. దీని మోటార్ 80hp పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఓహ్లిన్స్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్స్, క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లు దీంట్లో ఉన్నాయి.
0 Comments