Ad Code

ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు : సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేసిన డ్రైవర్


ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి జైపూర్ (ఒడిశా) వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమయస్ఫూర్తితో డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు వెంటనే క్రిందకు దిగి ప్రాణాపాయం తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu