Ad Code

ప్రేమను అంగీకరించలేదని తుపాకీతో బాలికను బలి తీసుకున్న యువకుడు


ర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లభ్ గఢ్‌లోని శ్యామ్ కాలనీలో 17ఏళ్ల బాలికపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ముగ్గురు బాలికలు కోచింగ్ నుండి తిరిగి వస్తుండగా బైక్ పై వచ్చిన యువకుడు రెండు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలిక పొత్తి కడుపులోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లగా మరో బుల్లెట్ ఆమె భుజానికి తాకినట్టు తెలుస్తుంది. దీంతో బాలిక వణుకుతూ పారిపోయే ప్రయత్నం చేసింది. కాల్పులు జరిపిన తరవాత అక్కడ నుండి యువకుడు బైక్ పై పారిపోయాడు. సీసీ టీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి కాల్పులు జరిపింది జతిన్ మంగ్లాగా గుర్తించారు. ప్రేమను తిరస్కరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాల్పులకు ఒకరోజు ముందు తమ తల్లి దండ్రులు వేధిస్తున్నాడని నింధితుడి తల్లికి ఫిర్యాదు చేసినట్టు బాలిక సోదరి తెలిపింది. మరుసటి రోజే కాల్పులు జరిపాడని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే అతడి తల్లి వేడుకుందని అందుకే ఫిర్యాదు చేయాలేదని వెల్లడించింది. ప్రస్తుతం నింధితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu