Ad Code

టెస్లా కంపెనీ నుంచి ఎగిరే కార్లు : సీఈవో ఎలాన్ మస్క్ వెల్లడి


టెస్లా కంపెనీ నుంచి ఎగిరే కారును తీసుకువస్తున్నట్లు సీఈవో ఎలాన్ మస్క్ ఒక ప్రముఖ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు సంబంధించిన ప్రోటోటైప్‌ను ఈ ఏడాది చివరిలోపు ప్రదర్శిస్తామని ప్రకటించాడు. సాంకేతికతలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోయే ఈ ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకోవడానికి ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మస్క్ చెప్పిన వివరాల మేరకు ఈ ఫ్లయింగ్ కారు ప్రదర్శన "చరిత్రలోనే మరపురాని ఉత్పత్తి ఆవిష్కరణ"గా నిలుస్తుందట. ఈ విషయం విన్న అభిమానులతో పాటు టెక్ ప్రపంచం సైతం ఆశ్చర్యంలో మునిగిపోయింది. అయితే, ఈ కారు రూపకల్పన, అది ఎలా పనిచేస్తుందనే దానిపై మాత్రం మస్క్ మౌనం వహించారు. ఈ వాహనానికి రెక్కలు ఉంటాయా? లేక హెలికాప్టర్‌ తరహాలో నిలువుగా పైకి లేస్తుందా అనే ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. "అన్వీల్ కంటే ముందుగా నేను ఆ రహస్యాన్ని బయటపెట్టలేను" అంటూ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు. సాంకేతిక వివరాలను మస్క్ రహస్యంగా ఉంచినా, ఈ ఆవిష్కరణ "ఊహకు అందని అద్భుత సాంకేతికతతో" ఉంటుందని మాత్రం స్పష్టం చేశారు. హాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా జేమ్స్ బాండ్ సినిమాల్లోని కార్ల ఫీచర్లన్నింటినీ కలిపినా, తమ ఫ్లయింగ్ కార్ వాటి కంటే మించిన వినూత్నతతో ఉంటుందని మస్క్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో విప్లవాత్మక ప్రాజెక్టులను ప్రకటించి, వాటిని విజయవంతంగా అమలు చేసిన మస్క్ మాటలు, ఈ కొత్త ఫ్లయింగ్ కార్ కాన్సెప్ట్‌పై అంచనాలను భారీగా పెంచాయి.


Post a Comment

0 Comments

Close Menu