అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ , ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ కలిసి కనిపించడంతో వచ్చే ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కోలీవుడ్ వర్గాల్లో ఊపందుకున్నాయి. ఈ ప్రేమ వార్తలకు ఓ సంఘటన బలాన్ని చేకూర్చింది. ఒక అమెరికన్ యూట్యూబర్ న్యూయార్క్ వీధుల్లో వీడియో చిత్రీకరిస్తుండగా అనిరుధ్, కావ్యమారన్ అనుకోకుండా కెమెరాకు చిక్కారు. ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు. "సీక్రెట్ లవర్స్ దొరికేశారు!" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ ప్రేమలో ఉన్నారంటూ గతంలోనూ వార్తలు వచ్చినా ఈ న్యూయార్క్ వీడియోతో ఆ ఊహాగానాలకు మరింత బలం దొరికింది. వచ్చే ఏడాదే వీరి పెళ్లి జరగబోతోందని, ఈ విషయంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం కూడా ఉందని కోలీవుడ్ మీడియా వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
0 Comments