కేంద్ర ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పాత కార్మిక చట్టాలను మార్చి నాలుగు ప్రధానమైన కొత్త లేబర్ కోడ్‌లను అమలు లోకి తెచ్చింది. ఈ సంస్కరణల ద్వారా సుమారు 40 కోట్లకు పైగా కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి ముఖ్యమైన హామీలు లభించనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రంగాల కార్మికులకు సరైన సమయంలో కనీస వేతనం తప్పనిసరిగా చెల్లించాలి. యువతకు అలాగే కొత్తగా చేరిన వారందరికీ తప్పనిసరిగా అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వాలి. దీనివల్ల జాబ్ సేఫ్టీ పెరుతుంది. స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. అలాగే మహిళలుకు రాత్రి షిఫ్ట్‌లలో పని చేయడానికి అనుమతి. 40 కోట్ల మందికి పైగా ఉన్న నాన్ యూనియన్ కార్మికులకు, గిగ్ కార్మికులు, ప్లాట్‌ఫామ్ కార్మికులకు కూడా పీఎఫ్,ఈఎస్ఐసి,బీమా మొదలైనవి వర్తిస్తాయి.ఫిక్స్‌డ్ -టర్మ్ ఉద్యోగులకు ఐదేళ్ల బదులు ఒక్క సంవత్సరం పని తర్వాతే గ్రాట్యుటీకి అర్హత ఉంటుంది. నిర్ణీత సమయం కంటే అదనంగా పనిచేసినందుకు రెట్టింపు వేతనం చెల్లించాలి. 40 ఏళ్లు పైబడిన కార్మికులందరికీ యాజమాన్యం ద్వారా ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ప్రమాదకర రంగాలలో భద్రత: ప్రమాదకర రంగాలలో పనిచేసే కార్మికులకు 100% ఆరోగ్య భద్రత హామీ ఇవ్వబడుతుంది. ఈ కొత్త కార్మిక కోడ్‌లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రంగంలోని వర్కర్స్ కు సామాజిక భద్రతా కోడ్ తో పాటు కనీస వేతనం హామీ లభిస్తుంది. అంతేకాకుండా డాక్ వర్కర్లు, మైన్ వర్కర్లు, ప్రమాదకర పరిశ్రమలలో పనిచేసేవారికి మెరుగైన భద్రతా ప్రమాణాలు లభిస్తాయి. అలాగే తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. ఈ కొత్త కోడ్ ప్రకారం ఐటీ, ఐటీఈఎస్ రంగాల ఉద్యోగులకు ప్రతి నెలా ఏడవ తేదీలోపు జీతం చెల్లించడం తప్పనిసరి. ఓవర్ టైం పనికి రెట్టింపు వేతనం లభిస్తుంది. అలాగే మహిళలకు నైట్ షిఫ్ట్ జాబ్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా ఈ కొత్త కార్మిక చట్టం ద్వారా ఉద్యోగుల ఆదాయం, జీవన ప్రమాణాలలు మెరుగుపడతాయని నిపుణులు చెప్తున్నారు. ఈ చట్టం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సంస్కరణల వల్ల భారతీయ కార్మిక వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ అవ్వనుంది. దేశ నిర్మాణంలో పాలుపంచుకునే ప్రతి కార్మికుడికి గౌరవం, భద్రత, న్యాయం అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వంఈ కొత్త కార్మికుల కోడ్ ను ముందుకు తీసుకువెళుతోంది.
0 Comments