దేశీయ మార్కెట్లో హోండా కార్స్ ఇండియా సరికొత్త ఎస్‌యూవీ 'ఎలివేట్ ఏడీవీ' ని ప్రవేశపెట్టింది. యువతను ఆకట్టుకునేలా దీనికి అనేక అధునాతన ఫీచర్లు జోడించినట్టు మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ చెప్పారు. రెండు వెర్షన్లలో లభించే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్‌లో రూ.15.20 లక్షల నుంచి రూ.16,66,800 వరకు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు తమకు అత్యంత కీలక మార్కెట్లని తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా ఏడు శాతం వరకు ఉంటుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అల్ఫా ఈవీ కారును భారత్‌లోనూ విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లతో చర్చిస్తున్నట్టు కునాల్ చెప్పారు. ఈ ఈవీ కారును భారత్‌లో తయారుచేసి జపాన్‌తో సహా అనేక దేశాలకు ఎగుమతి చేయబోతున్నట్టు తెలిపారు.
ホーム
/
Vice President
/
హోండా కార్స్ ఇండియా నుంచి ఎలివేట్ ఏడీవీ విడుదల
Friday, November 21, 2025
automobile domestic market. Kunal Behal electric car Honda Cars India launches Elevate ADV Marketing said added many advanced features to attract the youth sales science technology Vice President
No comments:
Post a Comment