Ad Code

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ తొక్కిసలాట : తొమ్మిది మంది భక్తులు మృతి, అనేక మందికి గాయాలు


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఆలయం లోపలకి ప్రవేశించే ముందు గేట్ల వద్ద భారీగా భక్తులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే గేట్ తెరవగానే మెట్లపై గందరగోళం ఏర్పడింది. దీంతో మెట్లపై ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు తోసుకుని కిందపడిపోయారు. అదే సమయంలో కింద పడిపోయిన వారిని తొక్కుకుంటూ ప్రజలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు విడిచారు. అనేక మంది గాయపడ్డారు. గుడి యాజమాన్యం చేసిన ఒక చిన్న తప్పిదం వల్లే ఈ ఘోరమైన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆలయానికి భారీ ఎత్తున భక్తులకు అనుమతినివ్వడమే ఆలయ యాజమాన్యం చేసిన పెద్ద తప్పు అని తెలుస్తోంది. సాధారణంగా ఒక చిన్న వేడుక లేదా సాదాసీదా సెలబ్రెటీ వస్తేనే పోలీసుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అలాంటిది కార్తీక మాసంలో అది కూడా ఏకాదశి రోజు ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని తెలిసి కూడా ఆలయ యాజమాన్యం పోలీసులకు ఎలాంటి ఇన్ఫార్మ్ చేయలేదని.. వారి నుంచి అనుమతి తీసుకోకుండానే భారీగా తరలి వచ్చిన భక్తులను ఆలయంలోకి అనుమతించారని తెలుస్తోంది. 


Post a Comment

0 Comments

Close Menu